AP Elections 2024: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం మొదలు పెట్టనుంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

New Update
AP Elections 2024: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టి వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. దీనిపై ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.

ALSO READ: వైసీపీలో నాలుగో జాబితా మీద నేతల్లో టెన్షన్…ఇంకా కొనసాగుతున్న కసరత్తులు

ఉత్తరాంద్ర నుంచే..

త్వరలో ఏపీలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వైనాట్ 175 నినాదంతో ప్రజల్లోకి గత 5 ఏళ్ళు అదికారంలో ఉండి చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయనున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం మొదలు పెట్టనుంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ క్రమంలో సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో గురువారం సీఎం జగన్ కీలక సమావేశం నిర్శహించారు.

నాలుగో లిస్ట్ పై ఉత్కంఠ..

మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యం సీఎం జగన్(CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్థానాల్లో టార్గెట్ 175 కి 175 సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే ఎంపీ స్థానాల్లో అన్ని స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఈ క్రమంలో సర్వేలలో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తున్నారు. ఇప్పటికే ఇంఛార్జిలను నియమిస్తూ వైసీపీ అధిష్టానం మూడు లిస్టులను విడుదల చేసింది. తాజాగా నాలుగో లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది.

DO WATCH: 

Advertisment
తాజా కథనాలు