AP Elections : అసెంబ్లీ ఎన్నికలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

టీడీపీ ఛీఫ్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.

CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ!
New Update

TDP Chief Chandra Babu : మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు(Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్(YS Jagan) ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. జనవరి 5 నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు టీడీపీ ఛీఫ్ చంద్రబాబు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు.

ALSO READరూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన..

తన సొంత నియోజకవర్గమైన కుప్పం(Kuppam) లో పర్యటించనున్నారు చంద్రబాబు. మూడు రోజులపాటు అక్కడే పర్యటన చేయనున్నారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటన చేస్తారు. రేపు, ఎల్లుండి అక్కడి టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిననున్నారు.

ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన..

ఎన్నికల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిన్న (బుధవారం) రాత్రి కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూడు రోజుల పాటూ అక్కడే బస చేయనున్నారు. డిసెంబర్ 28, 29, 30 తేదీ లలో మొత్తం గోదావరి జిల్లాల్లో తిరిగి చర్చలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. నిన్న అచ్చంపేట జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు టీడీపీ, జనసేన పార్టీ నేతలు. అక్కడి రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ ఆధ్వర్యంలో అచ్చంపేట జంక్షన్ నుండి విద్యుత్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిన్న రాత్రికి విద్యుత్ నగర్లో గెస్ట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ బస చేశారు. ఈ రోజు నుండి విద్యుత్ నగర్ చల్లా పంక్షన్ హల్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు కార్యకర్తలు తో జనసేనాని అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా ఉండాలి. ఏమేమి చేయాలి లాంటి అంశాల గురించి చర్చించనున్నారు.

#chandrababu #pawan-kalyan #ap-elections-2024 #ap-latest-news #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe