Devineni Uma: దేవినేని ఉమకు ఊహించని ట్విస్ట్

దేవినేని ఉమకు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బొమ్మసాని సుబ్బారావుతో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ భేటీ అయ్యారు. ఇప్పటివరకు టీడీపీలో దేవినేని ఉమ, బొమ్మసాని రెండు వర్గాలుగా ఉన్నారు. తాజాగా బొమ్మసాని వసంత కృష్ణప్రసాద్‌‌తో చేతులు కలపడం హాట్‌టాపిక్‌‌గా మారింది.

New Update
Devineni Uma: దేవినేని ఉమకు ఊహించని ట్విస్ట్

Devineni Uma Maheswara Rao: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏకమవుతున్నారు టీడీపీ నేతలు. బొమ్మసాని సుబ్బారావుతో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కలిసి పనిచేస్తాం..

భేటీ తర్వాత వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి పనిచేస్తామని బొమ్మసాని ప్రకటించారు. మైలవరంలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని అన్నారు. ఇప్పటివరకు టీడీపీలో దేవినేని ఉమ, బొమ్మసాని రెండు వర్గాలుగా ఉన్నారు. తాజాగా బొమ్మసాని వసంత కృష్ణప్రసాద్‌ తో చేతులు కలపడం హాట్‌టాపిక్‌ గా మారింది. దేవినేని..బొమ్మసాని, వసంతతో కలిసి పనిచేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ గెలుపుకు.. దేవినేని కృషి చేస్తారా అన్న అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు