MLA Vunnamatla Eliza : ఏపీ(AP) లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నిక(Assembly - Lok Sabha Elections) లకు సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ(YCP) అధినేత, సీఎం జగన్(CM Jagan) కు బిగ్ షాక్ ఇచ్చారు ఆయన చెల్లి, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో చేర్చుకుంటున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా(Vunnamatla Eliza) వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికి వరకు అభ్యర్థులను ప్రకటించని షర్మిల.. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకొని అప్పుడు అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో చలనం లేని కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ కనీసం 10 మంది ఎమ్మెల్యేలను, పార్లమెంట్ కు 5 మంది కాంగ్రెస్ ఎంపీలను పంపాలని షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు. మరి షర్మిల రాకతోనైనా ఏపీలో కాంగ్రెస్ బ్రతికి బయటపడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.
This browser does not support the video element.
జగన్ పై అలక.. అందుకే చెల్లి దగ్గరికి..
రానున్న అసెంబ్లీ ఎన్నికలో మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవాలని సీఎం జగన్.. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కొందరు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. టికెట్ రాలేదని భంగపడ్డ కొందరు నేతలు ఇప్పటికే వైసీపీ కి రాజీనామా చేసి.. ఇతర పార్టీలలో చేరుతున్నారు. తాజాగా ఇదే కారణంతో వైసీపీకి కి రాజీనామా చేశారు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా. ఆయన కాంగ్రెస్ లో చేరారు. చింతలపూడి టికెట్ ను సీఎం జగన్ ఈసారి ఎలిజా కాకుండా కంభం విజయరాజుకు కేటాయించారు. తనకు టికెట్ వస్తుందని ఎన్ని ఆశలు పెట్టుకున్న ఎలిజాకు నిరాశే మిగిల్చారు సీఎం జగన్. టికెట్ రాకపోవడంతో మొదటగా టీడీపీ లేదా జనసేనలో చేరాలని భావించిన ఎలిజా.. ఆ పార్టీల్లో కూడా టికెట్ రాదని భావించి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. ఎమ్మెల్యే టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబీలో ఎన్నికల్లో చింతలపూడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలిజా పోటీ చేయనున్నట్లు సమాచారం.