Sharmila: సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల విమర్శల దాడి

సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు షర్మిల. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. సొంత లాభాల కోసమే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చామని జగన్ సర్కార్ చెప్పుకుంటుందని మండిపడ్డారు.

YS Sharmila: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం
New Update

APCC Chief Sharmila: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు నేతల మధ్య విమర్శలతో వేడెక్కాయి. తాజాగా సీఎం జగన్, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు చేసిన మోసం చాలదని...జాబు రావాలంటే జగన్ కావాలని ఘరానా మోసానికి తెరలేపాడు జగన్ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.

ALSO READ: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?

2.32లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, 23వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మీరు...5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి అని నిలదీశారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని.. జంబో డీఎస్సీ అని.. APPSC నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచిన జగన్.... మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం తప్పా...గౌరవంగా చెప్పుకొనే ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా ? నేటికీ శాఖల పరిధిలో 2.25లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జగన్ మార్క్ పాలనకు నిదర్శనం అని చురకలు అంటించారు.

#ap-elections #cm-jagan #sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe