YCP 9th List Released: ఏపీలో మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు సీఎం జగన్ (CM Jagan). ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎనిమిది లిస్టులతో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా తొమ్మిదవ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా లావణ్య, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి (Vijaysai Reddy), కర్నూల్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఇంతియాజ్ పేర్లను ప్రకటించింది.
ఎమ్మెల్యే ఆర్కేకు నో టికెట్..
ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి వైసీపీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి షాక్ ఇచ్చారు సీఎం జగన్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్కేకు టికెట్ కట్ చేశారు జగన్. అయితే.. ఎమ్మెల్యే ఆర్కేకు ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరందుకుంది. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కేకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవికి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని ఒక వర్గం గుసగుసలు పెడుతోంది. ఏది ఏమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి, తనకు.. షర్మిలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆర్కేకు సీఎం జగన్ ఎలాంటి పదవి ఇస్తారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
లోకేష్ పై లావణ్య గెలిచినా? ..
వైసీపీని గద్దె దించుదామని వ్యూహాలు రచిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఇటీవల 99 మందితో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మంగళగిరి నుంచి టీడీపీ , జనసేన బలపరిచిన అభ్యర్థిగా నారా లోకేష్ పోటీలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై ఓటమి చెందారు లోకేష్. అయితే.. తాజాగా వైసీపీ అధిష్టానం మంగళగిరి అభ్యర్థిని మార్చింది. ఈసారి ఆర్కేకు కాకుండా లావణ్యకు టికెట్ ఇచ్చింది. మరి ఈ ఎన్నికల్లో మగళగిరి ప్రజలు టీడీపీ అభ్యర్థి లోకేష్ కు పట్టం కట్టబెడుతారా? లేదా వైసీపీ అభ్యర్థి లావణ్యకు పట్టం కట్టబెడుతారా? అనేది వేచి చూడాలి.
Also Read: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్…రూ. 5.49కోట్ల జరిమానా.!