AP Elections 2024: వైసీపీలోకి టీడీపీ కీలక నేత

ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్‌. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.

AP Elections 2024: వైసీపీలోకి టీడీపీ కీలక నేత
New Update

Gandi Ravikumar Joined in YCP: మరికొన్ని రోజుల్లో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్‌. ఈరోజు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. రవికుమార్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు చేరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్‌ఆర్‌సీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ భగవాన్‌ జయరామ్‌ పాల్గొన్నారు.

This browser does not support the video element.

Also Read: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన

ఈ నెల 16న వైసీపీ జాబితా..

ఈనెల 16న వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తుండగా.. మార్చి 16న ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను జగన్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించి, అదే రోజు ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

 

మళ్లీ అదే ప్రాంతం నుంచి..

2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్‌.. మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలుపెడతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

#ap-elections-2024 #cm-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe