Sajjala Ramakrishna Reddy: ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర.. సజ్జల కీలక ప్రకటన

ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రలు చేపడుతారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. మొత్తం మూడు బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 27న ప్రొద్దుటూరులో, 28న నంద్యాలలో, 30న ఎమ్మిగనూరులో సభలు ఉంటాయని సజ్జల వెల్లడించారు.

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో పవన్‌కు డేంజర్.. సజ్జల హాట్ కామెంట్స్
New Update

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో అన్ని పార్టీలు ప్రచారాలపై కసరత్తు చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి సీఎం జగన్ ఎన్నికల ప్రచారాలపై కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. సజ్జల మాట్లాడుతూ.. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన చోట్ల బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

ALSO READ: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు

ప్రొద్దుటూరులో తొలి సభ..

తొలుత ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళులు అర్పిస్తారని అన్నారు. ప్రొద్దుటూరులోనే వైఎస్‌ జగన్‌ తొలి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. 4 సిద్ధం సభలతో క్యాడర్‌ని ఎన్నికలకు సమాయత్తం చేశామని.. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం అని పేర్కొన్నారు. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయని అన్నారు. దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర చేస్తారని వెల్లడించారు

ఇడుపులపాయ నుంచి..

ఇడుపులపాయ నుండి సీఎం జగన్ ఈ బస్సుయాత్ర మొదలు పెడతారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుస్తారని అన్నారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని తెలిపారు. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని అన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారని పేర్కొన్నారు.

సీఎం జగన్ సభలు..

* 27న ప్రొద్దుటూరులో తొలి సిద్ధం సభ.

* 28న నంద్యాలలో బహిరంగ సభ.

* 30న ఎమ్మిగనూరులో సభ.

#cm-jagan #ap-elections-2024 #sajjala-ramakrishna-reddy #lok-sabha-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe