Vizag : ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన లోక్‌సభ(Lok Sabha) సీటు విశాఖ. ఇక్కడ కూటమి అభ్యర్థి, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌కు మంత్రి బొత్స భార్య ఝాన్సీ గట్టి పోటీ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా తన సతీమణి పోటీ చేస్తున్న విశాఖపైనే బొత్స ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే రెండు చోట్లా పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏ మాత్రం పట్టులేని నియోజకవర్గం కావడం వైసీపీకి ప్రతికూల అంశం.
Also Read : ఏపీలో కాబోయే ఎంపీలు వీరే.. ఆర్టీవీ స్టడీ ఫలితాలు!
టీడీపీ(TDP) అభ్యర్థి శ్రీభరత్ ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. ఎలక్షనీరింగ్‌లోనూ పైచేయి సాధిస్తున్నారు. రెండు మూడు నెలల నుంచి రోజూ జనంలోనే ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. యంగ్ లీడర్ కావడం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, కూటమి ప్రభావం భరత్‌కు సానుకూలం. విశాఖ సిటీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ(YCP) కి పడే ఓట్లలో క్రాస్ ఓటింగ్ భరత్‌కు అనుకూలిస్తుందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఓవరాల్‌గా విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది.