/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YCP-Vanga-Geetha-Sensational-Interview-RTV-jpg.webp)
Vanga Geetha Interview: పిఠాపురంలో తన గెలుపు ఖాయమని వైసీపీ అభ్యర్థి వంగా గీత ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారన్నారు. చంద్రబాబు కారణంగా పెన్షన్ దారులు రోడ్డు ఎక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. జనం కోసం జగన్ పని చేస్తుంటే.. రాజకీయం చేస్తోంది ప్రతిపక్షాలు అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తమ ప్రచారం జోరుగా సాగుతోందన్నారు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.. సజ్జల హాట్ కామెంట్స్
వైయస్ జగన్మోహన్ రెడ్డి గాలితో మరింత స్పీడ్ పెంచుతున్నామన్నారు. పేదవారికి సరైన న్యాయం జరిగింది కాబట్టే.. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చూస్తున్నారన్నారు. జనసేన నాలుగు రోజులే ప్రచారం చేసి విజయం మాదే అని చెబితే ఎలా? అని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నామన్నారు. వంగా గీత పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.