Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఎన్నికల్లో కూడా రెండు సీట్ల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పవన్ గాజువాక, భీమవరం రెండు సీట్ల నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంతో (Bheemavaram) పాటు ఈ సారి కొత్తగా తిరుపతి (Tirupati) నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు
భీమవరం జరిగిన వారాహీ యాత్రలో (Varahi Yatra) మళ్లీ తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానన్న సంకేతాలను పవన్ ఇచ్చారు. ఇటీవల తిరుపతి నియోజకవర్గంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం తిరుపతి జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ జనసేన పరిస్థితి, టీడీపీ సహకారం, జనసేన బలాబలాలపై నేతలతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే.. గతంలో ఓటమి అనుభవంతో ఈ సారి రెండు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా గెలవాలన్న ఆలోచనతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో ప్రజారాజ్యం ఆవిర్భావం సమయంలో చిరంజీవి సైతం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పాలకొల్లుతో పాటు తిరుపతి నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి.. తిరుపతిలో మాత్రం విజయం సాధించారు. అయితే.. అప్పుడు చిరంజీవి చేతిలో ఓటమి పాలైన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు.