AP Elections 2024: మంగళగిరికి మెగా బ్రదర్స్ మకాం.. పవన్, నాగబాబు కొత్త స్కెచ్ ఇదేనా?

ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

AP Elections 2024: మంగళగిరికి మెగా బ్రదర్స్ మకాం.. పవన్, నాగబాబు కొత్త స్కెచ్ ఇదేనా?
New Update

ఏపీలోని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు నమోదుకు మెగా బ్రదర్స్ నాగబాబు (Nagababu), పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) దరఖాస్తు చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకర్గ పరిధిలో నాగబాబు ఫ్యామిలీ ఓటు వేసింది. తాజాగా మంగళగిరిలో ఆయన ఓటు హక్కు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉండట్లేదని నాగబాబుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నాగబాబుకు ఖైరతాబాద్‌లో ఓటు ఉందని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా మంగళగిరిలో ఓటు హక్కు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం చిరునామాపై ఆయన ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: AP Elections 2024: ఆ మంత్రికి షాక్ ఇవ్వనున్న జగన్.. టికెట్ కట్?

అయితే పవన్ దరఖాస్తుపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మంగళగిరిలో ఓటు హక్కు నమోదుకు పవన్, నాగబాబు ఆసక్తి చూపడంపై టీడీపీ, జనసేన వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరు మంగళగిరినే ఎందుకు ఎంచుకున్నారన్న అంశంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. నారా లోకేష్ మంగళగిరి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అయితే.. మంగళగిరిలో ఈ సారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించింది.

ఇందులో భాగంగా గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జ్‌గా ప్రకటిచింది. ఈ ప్రకటన కన్నా ముందే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా బ్రదర్స్ మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవడంపై చర్చ సాగుతోంది. పవన్, నాగబాబు ఇద్దరిలో ఒకరు మంగళగిరి నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారా? అన్న అంశంపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఇన్నాళ్లూ విజయవాడలో ఓటేసిన పవన్ తాజాగా మంగళగిరిలో ఓటు హక్కు నమోదుకు ప్రయత్నించడంపై వైసీపీలోనూ చర్చ సాగుతోంది. వీరిద్దరూ ఇక్కడ లోకల్ అనిపించుకోవడానికే ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారన్న భావన వ్యక్తం అవుతోంది.

#nara-lokesh #janasena-chief-pawan-kalyan #nagababu #ap-elections-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe