Mudragada to Join in YCP : కాపుల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాల్లో(AP Politics) ముద్రగడ ఎపిసోడ్ కాక రేపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ముందుగా జనసేన(Janasena) లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో జనసేన నేతలను ఆయన్ను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ సైతం ఆ సమయంలో జనసేన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్టు వార్తలొచ్చాయి. అటు వైసీపీ(YCP) నేతలను మాత్రం కలవడానికి కూడా ముద్రగడ ఇష్టంలేదని ప్రచారం జరిగింది. అయితే రాజకీయాలు ఒక రోజు ఉన్నట్టు మరో రోజు ఉండవు. అందుకే పరిణామాలన్ని వేగంగా మారిపోయాయి. పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ కేవలం 24 ఎమ్మెల్యే సీట్లే కేటాయించడం పట్ల అసంతృప్తిగా ఉన్న ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వైసీపీలో చేరే డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది.
జగన్ సమక్షంలో కండువా:
ఈ నెల 14న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ. ఇటీవల కిర్లంపూడి నివాసంలో వైసీపీ సీనియర్ నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు. పదవులు ఆశించకుండా పార్టీకి సేవలు అందిస్తానని వైసీపీ నేతలకు ముద్రగడ సూచించారు. ముద్రగడతో పాటు పలువురు కాపు నేతలు కూడా వైసీపీలోకి చేరే అవకాశముంది. వైసీపీలో చేరికతో తన చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు ముద్రగడ చెక్ పెట్టనున్నారు.
ఏపీ రాజకీయాల్లో కాపు ఉద్యమనేతగా పేరు పొందారు ముద్రగడ పద్మనాభం. గతంలో జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాశారు. దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో జనసైనికుల మధ్య ముద్రగడ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువని తెలిసిందే. దీంతో పవన్‌కు పోటీగా బలమైన కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
Also Read : నేడే ‘సిద్ధం’ చివరి సభ.. 15లక్షల మంది వస్తారని అంచనా.. జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ!