TDP-JSP: రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్‌..సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం..!

రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్‌ తగలనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం జరుగుతోంది. రూరల్‌ సీటుపై  గంపెడాశలు పెట్టుకున్న కందుల దుర్గేష్‌కు నిడదవోలు కేటాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

TDP-JSP: రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్‌..సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం..!
New Update

Kandula Durgesh V/s Butchaiah Chowdary: ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.

Also Read: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!

కాగా, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల పార్టీకి రాజీనామాలు కూడా చేస్తున్నారు. ఇలా ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. ఇదిలా ఉండగా రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్‌ తగలనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం జరుగుతోంది.



Also Read: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

అయితే, రూరల్‌ సీటుపై కందుల దుర్గేష్‌ గంపెడాశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ, కందుల దుర్గేష్‌కు నిడదవోలు కేటాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో జనసేన కార్యకర్తలు కందుల దుర్గేష్ నివాసానికి చేరుకున్నారు. జనసేన కార్యకర్త వాహనానికి ఉన్న జనసేన స్టిక్కర్లు తొలగించారు. ఐదేళ్ల క్రితం కారుకు వేసుకున్న పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. కందుల దుర్గేష్‌కే టికెట్ ఇవ్వాలని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

#ap-elections-2024 #butchaiah-chowdary #janasena-kandula-durgesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe