Roja Vs Lokesh: అశ్లీల వీడియోలు చూసే అలవాటు లోకేశ్‌ ది..అందుకే ఇలాంటి ఆలోచనలు- మంత్రి రోజా

పిల్లలు బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారని లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్‌కు ఉంది కాబట్టే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Roja Vs Lokesh: అశ్లీల వీడియోలు చూసే అలవాటు లోకేశ్‌ ది..అందుకే ఇలాంటి ఆలోచనలు- మంత్రి రోజా
New Update

టీడీపీ(TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం ముగింపు సభ తర్వాత అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటకు మాట పెరుగుతోంది. లోకేశ్‌, పవన్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు విరుచుకుపడుతుంటే.. నేరుగా జగన్‌వైపే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు టీడీపీ నేతలు. దీంతో ఏపీ మంత్రులు రంగంలోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు లోకేశ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇక సీఎం తన బర్త్‌డేన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండడంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు.

రోజా ఏం అన్నారంటే?

➼ పిల్లలు బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ ట్యాబ్ లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారు.

➼ అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్‌కు ఉంది కాబట్టి, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.

➼ నారా లోకేశ్‌కు ఎలాంటి ఎమోషన్స్ లేవు, తారక రత్న చనిపోయినా పట్టించుకోలేదు.

➼ జగనన్న పాదయాత్ర చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా 4వేల కిలో మీటర్లు, 400 రోజు అని చెప్పి 40 కి.మీ కూడా కంటిన్యూగా నడవలేదు.

➼ 200 రోజులు అని చెప్పి 200 సార్లు బ్రేక్ తీసుకున్నాడు లోకేశ్‌.

➼ ఫెయిల్యూర్ పొలిటీషియన్ లోకేశ్‌.

➼ 4 కోట్ల లోకల్ ఓటర్లు, 4 నాన్ లోకల్ లీడర్స్ కు మధ్య రానున్న ఎన్నికలు జరగబోతున్నాయి.

➼ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ను ప్రజలు తరిమి కొడతారు.

మంత్రులపై ఫైర్:
నవశకం సభలో జగన్‌తో పాటు వైసీపీ మంత్రులపైనా లోకేశ్‌ కౌంటర్లు విసిరారు. కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఐటీ కంపెనీలు(IT Companies) అన్ని పక్క రాష్ట్రానికి పరార్‌ అయ్యాయని చురకలంటించారు. విశాఖ‌(Vizag) ని కేపిట‌ల్ చేస్తానంటూ క్రైం కేపిట‌ల్ చేశాడని… పరిపాల‌నా రాజ‌ధాని చేస్తాన‌ని క‌బ్జాల రాజ‌ధాని చేశాడని ఫైర్ అయ్యారు లోకేశ్‌. దసపల్లా భూములు, సిఎన్బిసి భూములు, హయగ్రీవ భూములు,ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేశారని… టిడిఆర్ బాండ్స్ కుంభకోణంలో వేల కోట్లు వైసిపి నాయకులు కొట్టేశారని ఆరోపించారు లోకేశ్‌. చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లు అన్ని రెడ్ బుక్‌లో ఉన్నాయని వారికి శిక్ష తప్పదని లోకేశ్‌ హెచ్చరించారు.

Also Read: వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..

WATCH:

#lokesh #jagan #roja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe