Pinnelli Arrested : ఎన్నికల (Elections) రోజు ఈవీఎం (EVM) లను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మరో వైపు లుకౌట్ నోటీసులు (Look Out Notice) సైతం జారీ చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలు పిన్నెల్లి సోదరుల కోసం పోలీస్ బృందాల గాలింపు చేపట్టినట్లు సమాచారం. మొత్తం 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదైంది. ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువు అయితే రామకృష్ణారెడ్డికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆయన ఎన్నికల్లో గెలిచినా డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందని వారు అంటున్నారు.
Also Read : రూ. 5 కోట్లు… ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ కథను చదవండి!
ఇప్పటికే ఎమ్మెల్యే అరెస్ట్?
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పిన్నెల్లి గన్‌మెన్, డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ వాహనాలను సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎమ్మెల్యే తన ఫోన్ కారులోనే వదిలేసి సోదరుడితో కలిసి వెళ్లిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే.. పిన్నెల్లి సోదరులను ఇప్పటికే అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనను రసహ్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నరన్న ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై సాయంత్రంలోగా పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.