వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) టికెట్ల కేటాయింపుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనవరి 1 నాటికి టికెట్ల కేటాయింపును పూర్తి చేసి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో ఆయన ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధినేత జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మర్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పెడన, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం, తిరువూరులో అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పెడన నుండి ఉప్పాళ్ల హారిక, విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి ఫ్యామిలీ నుంచి ఒకరు, విజయవాడ వెస్ట్‌లో నిమ్రా కాలేజ్ చైర్మన్ రసూల్ ఖాన్ ను పోటీకి దించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి?
వల్లభనేని వంశీని గన్నవరం నుంచి పెనమలూరుకు మార్చాలని జగన్ నిర్ణయానికి వచ్చారని సమాచారం. తిరువూరులో మాజీ ఎమ్మెల్యే పద్మజ, బరిగల కోటేష్ పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జోగి రమేష్‌కు మైలవరం టికెట్ లేదంటే ఏలూరు ఎంపీగా పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అవనిగడ్డ నుంచి మోపిదేవి, అంబటి పేర్లను వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. మచిలీపట్నం సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇక్కడి నుంచి పేర్ని నానినే పోటీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. కానీ ఆయన మాత్రం తన కుమారుడు పేర్ని కిట్టుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. గుడివాడలో కొడాలి నాని, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, నందిగామలో జగన్మోహన్‌రావు, పామర్రులో అనిల్‌కుమార్, నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, కైకలూరు దూలం నాగేశ్వరరావు పేర్లను ఫైనల్ చేసింది హైకమాండ్.