RGV: అలా ఇస్తే లక్కీ నంబర్..ఇలా ఇస్తే పావలా.. జనసేనకు ఆర్జీవీ పంచులు!

జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై డైరెక్టర్ ఆర్జీవీ సోషల్ మీడియాలో స్పందించారు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారని.. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారన్నారు ఆర్జీవీ. అందుకే మధ్యే మార్గంగా 24 ఇచ్చారని పోస్ట్ చేశారు.

New Update
RGV: అలా ఇస్తే లక్కీ నంబర్..ఇలా ఇస్తే పావలా.. జనసేనకు ఆర్జీవీ పంచులు!

RGV Tweet Over Janasena First List: ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు (Janasena) 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.

Also Read: పరిటాల శ్రీరామ్‌ సీటుపై ఉత్కంఠ..! రెండో సీటు ఇస్తారా?

ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆర్జీవీ (RGV) ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారని.. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారన్నారు ఆర్జీవీ. అందుకే మధ్యే మార్గంగా 24 ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పావలా వంతు..

కాగా, జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై అధికార పార్టీ మంత్రులు జనసేన అధినేతపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి (Ambati Rambabu) ట్విట్టర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు..ఛీ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ చేశారు. పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది ... మన అన్నగారిలా అని పోస్ట్ చేశారు.

Also Read: అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు.. 

Advertisment
తాజా కథనాలు