CM Jagan: అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న వేళ సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ (Pension Increased) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్ ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేశారు. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనున్నారు. వై నాట్ 175 అని రంగంలో దిగిన జగన్ సర్కార్..ప్రచారంలో దూసుకుపోతోంది. సిద్ధం పేరుతో మహాసభలు నిర్వహిస్తూ సీఎం జగన్ ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని.. వైసీపీ (YCP) ప్రభుత్వం వల్ల లబ్ది చేకూరితే తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని సీఎం జగన్ కోరుతున్నారు.
ALSO READ: మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?
త్వరలో మ్యానిఫెస్టో ప్రకటన..
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో పై కసరత్తు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మేము రెడీగా ఉన్నామని.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో అభ్యర్థుల ఫైనల్ లిస్టును విడుదల చేస్తామని అన్నారు. మ్యానిఫెస్టోపై కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండా గా వైసీపీ మ్యానిఫెస్టో ఉంటుందని అన్నారు. మార్చి 13 లేదా 14న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ రెండవ వారంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయపడ్డారు.
వైసీపీలో చేరికలు.. రాజీనామాలు..
లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నేతల రాజీనామాలు చేరికలతో ఆసక్తికరంగా మారాయి. తాజాగా టీడీపీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు. ఇటీవల టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి రాకపోవడంతో వారు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.