/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/raghu-rama-krishna-raju-shock-jpg.webp)
AP Elections 2024 : 2019లో రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) నరసాపురం(Narasapuram) నుంచి వైసీపీ(YCP) ఎంపీగా గెలుపొందారు. అయితే ఆయన కొన్ని రోజులు కూడా వైసీపీ తరుఫున ఉండలేదు. పేరుకు వైసీపీలోనే కొనసాగినా రోజుకోకసారి జగన్(YS Jagan) ను తిట్టడమే ఎజెండాగా మీటింగ్‌లు పెట్టేవారు. అటు టీడీపీ(TDP) ఆయన్ను బాగా ఓన్ చేసుకుంది. వైసీపీలోనే కొనసాగుతూ టీడీపీ జెండా మోశారు రఘురామ. అత్యంత ధనిక ఎంపిల్లో ఒకరైన రఘురామకు గోదావరి జిల్లాల్లో పలుకుబడి ఎక్కువ. అందుకే ఆయన చేసిన చెల్లుతుందనే ధీమా. ఆయన జగన్‌పై వేసే డైలాగులను టీడీపీ బాగా ప్రమోట్ చేసుకుంది. అటు రఘురామా మాత్రం బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. నరసాపురం సీటు తనకే దక్కుతుందని ఇటివలి కాలంలో అనేకసార్లు చెప్పుకొచ్చారు. తీరా బీజేపీ రిలీజ్ చేసిన ఐదో జాబితాలో రఘురామాకు చోటు దక్కలేదు. నరసాపురం టికెట్ శ్రీనివాస్ వర్మకి ఇచ్చింది బీజేపీ. దీంతో రఘురామాకు మైండ్ బ్లాక్ అయ్యింది.
జగనే కారణం:
తనకు టికెట్ దక్కకపోవడానికి జగనే కారణమని రఘురామా అంటున్నారు. బీజేపీ నేత సోము వీర్రాజును అడ్డం పెట్టుకోని జగన్ ఇలా చేశారని అంటున్నారు. తాను టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంటే త్వరలోనే రఘురామా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. అయితే టీడీపీలో చేరినా నరసాపురం టికెట్ దక్కడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఓ సారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. అది జాతీయ పార్టీ. వారి లెక్కలు వేరే ఉంటాయి.
విజయనగరం టికెట్ దక్కుతుందా?
అటు విజయనగరం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ సీటుని టీడీపీ రఘురామకు ఇస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇక నర్సాపురం నుంచే తాను కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు రఘురామ. ఇక ఎంపీగా గెలిచిన తర్వాత నాలుగేళ్ల పాటు నర్సాపురానికి దూరంగా ఉన్నారు రఘురామా. ఆయన నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడమే టికెట్ దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. అందుకే టీడీపీ కూడా రఘురామాను విజయనగరం ఎంపీగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.
Also Read : బుద్ధి బయటపడింది.. పాండ్యా వల్లే మ్యాచ్ పోయింది..ఎందుకంటే?