/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/akila-jpg.webp)
Bhuma Kishore Reddy Joined in YCP: నంద్యాల జిల్లా(Nandyal District) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జిగా ఉన్న భూమా కిశోర్‌రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపి పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా కిశోర్‌రెడ్డి మాట్లాడుతూ..మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరాచకాలకు చమర గీతం పాడుతామని వ్యాఖ్యానించారు. సెటిల్‌మెంట్లకు, డెకాయిట్స్‌కి ఆళ్లగడ్డలో స్థానం లేదని పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా భూమా అఖిలకు, కిశోర్‌కు మధ్య రాజకీయ, కుటుంబ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అఖిల ప్రియ సొంతం పెదనాన్న కుమారుడు, భూమా కిశోర్‌రెడ్డి(Bhuma Kishore Reddy). బీజేపీలో ఉండగా పొత్తు ఉంటే సీటు తనదేనని కిశోర్ భావించారు. అయితే, టీడీపీ అఖిలప్రియకు టికెట్ ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తూ వైసీపీలో చేరారు. టీడీపీ(TDP) కి చెక్ పెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ కిషోర్ రెడ్డిని బరిలోకి దింపింది.