Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటాకు మరో షాక్

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న వేలం నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు.

New Update
TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గ౦టాకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25న వేల౦ నిర్వహించనున్నారు బ్యాంకు అధికారులు. ప్రత్యూష కంపెనీలోని తొమ్మిది రకాలైన ఆస్తులకు వేలం జరగనుంది. గతంలో రూ. 248 కోట్ల రూపాయల మేర ప్రత్యూష క౦పెనీ బ్యాంక్ రుణం తీసుకుంది.

ALSO READ: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

ఆ లోన్ తాలూకా వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మెుదటిసారిగా 2006 అక్టోబర్ 4న రుణ౦ చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో.. 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని కీలకమైన ప్రాంతాలలో ఉన్న భవనాలు, రుషికొండ వద్ద ఉన్న స్థలాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

మరోవైపు టీడీపీ షాక్..

అభ్యర్థుల ప్రకటనలో సీనియర్లకు టీడీపీ (TDP) హైకమాండ్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి, కీలక నేత దేవినేని ఉమను (Devineni Uma) పక్కనపెట్టింది. థర్డ్ లిస్ట్ లో మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించారు.‌ దీంతో దేవినేని ఉమకు సీటు లేనట్లేనని తేలిపోయింది. పెనమలూరులో బోడె ప్రసాద్ కు కేటాయించారు చంద్రబాబు (Chandrababu). మరో కీలక నేత గంటా శ్రీనివాసరావుకు కూడా షాక్ ఇచ్చింది టీడీపీ నాయకత్వం. ఈ రోజు విడుదలైన 3వ జాబితాలోనూ ఆయన పేరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెందుర్తిలోనూ బండారు సత్యనారాయణమూర్తికి షాక్ ఇచ్చారు. ఆయన పేరు కూడా లిస్ట్ లో లేదు.

ఇంకా.. మాజీ మంత్రి, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కూడా సీటు కేటాయించలేదు చంద్రబాబు. పెండింగ్‌లోనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పాలకొండ సీట్లను ఉంచడం అక్కడి నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విశాఖపట్నం పెందుర్తి, భీమిలి సీట్లను కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంచారు చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో దర్శి, కడప జిల్లాలో రాజంపేట, బద్వేల్ టికెట్లు కూడా పెండింగ్ లో ఉంచారు.‌

Advertisment
తాజా కథనాలు