AP Politics : చీరాలలో కాంగ్రెస్ నుంచి ఆమంచి పోటీ.. ఎఫెక్ట్ ఏ పార్టీకి?

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం సాధిస్తారా? లేక ఏ పార్టీ ఓట్లను చీలుస్తారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

New Update
AP Politics : చీరాలలో కాంగ్రెస్ నుంచి ఆమంచి పోటీ.. ఎఫెక్ట్ ఏ పార్టీకి?

Congress : ఇటీవల వైసీపీ(YCP) కి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన చీరాల(Chirala) మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) ఈ రోజు ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ చీరాల అభ్యర్థిగా ఆయన పోటీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమంచి కోసమే చీరాల సీట్‌ను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో చీరాలలో షర్మిలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలోనే ఆమంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆమంచి పోటీతో చీరాలలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఆయన బరిలో ఉంటే TDP, YCP ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందన్న చర్చ స్థానికంగా సాగుతోంది. దీంతో త్రిముఖ పోటీలో ఆమంచి విజయం సాధిస్తారా? లేక ఎవరికి నష్టం చేస్తారు? అన్న విషయంపై స్పష్టత రావాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే!

Advertisment
Advertisment
తాజా కథనాలు