Pawan Kalyan Bangalore Tour : జనసేన అధినేతన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటన వెళ్లారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే తో (Eshwar Kandre) భేటీ కానున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని.. ప్రాణ హాని కలిగిస్తున్నాయని చెప్పారు. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం అని.. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయని తెలిపారు. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను ఈరోజు జరిగే చర్చలో పవన్ కళ్యాణ్ కోరనున్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు రూపొందించనున్నారు.
Also Read: లోక్‌సభలో వక్ఫ్ బోర్డు నియంత్రణకు సవరణ బిల్లు.. అందులో ఏముంది?