కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఓ దుండగుడు. స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. ఈ నెల 20వ తేదీన స్కూల్ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి బయటకు వెళ్లింది మానస. ఎంత సేపైనా మానస తిరిగి రాకపోవడంతో తల్లికి ఫోన్ చేసి ఉపాధ్యాయులు చెప్పారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి జ్యోతి. కట్టమూరు సమీప పామాయిల్ తోటలో ఆరు రోజుల తరువాత కుళ్ళిన స్థితిలో మృతదేహన్ని స్ధానికులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, వస్తువుల ఆధారంగా అది మానస మృతదేహమేనని తల్లి జ్యోతి గుర్తించింది. తల్లి జ్యోతితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపేట మండలం వడిసలేరుకు చెందిన బాలిక తల్లి జ్యోతి సమీప బంధువు నానిబాబు అనే వ్యక్తి బైక్‌పై తీసుకుని వెళ్ళాడాన్ని పోలీసులు గుర్తించారు. 3 సంత్సవరాలుగా తల్లి జ్యోతి భర్తను విడిచిపెట్టి మేనత్త కొడుకైన నానిబాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జ్యోతి- నానిబాబును కొన్ని రోజులుగా దూరం పెట్టడంతో పక్కా ప్లాన్‌తో నానిబాబు మానసను కిడ్నాప్ చేసిన కొద్ది నిమిషాల్లోనే హత్య చేశాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడు నానిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ప్రకటించారు పోలీసులు.
కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఆరు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్నారి మానస మృతికి కారణమైన నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, పాఠశాల దగ్గర సరైన రక్షణ లేదంటూ ఆందోళన చేపట్టిన పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీవాసులు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో మానస ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజాసంఘాలు, సేవాసంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్‌తో నిరసన తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు పెట్టినా.. చిన్న పిల్లలపైనా.. మహిళలుపై అగాత్యాలు ఆగడం లేదంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు మానసను దారుణ హత్య చేసిన నిందితుడైన నాని బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని సోమవారం పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహిళలు గుర్రాల సెంటర్‌లో ధర్నా చేశారు. పాపా మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.