Sharmila: సిగ్గు సిగ్గు జగన్.. షర్మిల విమర్శల దాడి

AP: జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు అని విమర్శించారు.

Sharmila: సిగ్గు సిగ్గు జగన్.. షర్మిల విమర్శల దాడి
New Update

YS Sharmila: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి గారు, కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం.

షర్మిల ట్విట్టర్ (X)లో.."MLA = Member of Legislative Assembly, not Member of Media Assembly.
ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని... రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని... నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే... తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది.

Also Read: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్

గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!!

బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది." అని ఫైర్ అయ్యారు.

#ap-news #ys-jagan #ys-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe