Vizag Infosys: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే!

విశాఖ, అనకాపల్లిలో ఈరోజు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు. అచ్యుతాపురంలో లారెస్ లాబ్ యూనిట్ 2 ను సైతం సీఎం ప్రారంభిస్తారు.

Vizag Infosys: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే!
New Update

ఈ రోజు విశాఖలో ఇన్ఫోసిస్ ను (Vizag Infosys) ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్ (AP CM Jagan). ఈ రోజు ఆయన విశాఖ, అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:20 కి విశాఖ ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకుంటారు. 10:40 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా ఋషికొండ వద్ద ఉన్న ఐటీ హిల్స్ లోని హిల్ నెంబర్ 3 కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హిల్ నెంబర్ 2కి చేరుకుని ఇన్ఫోసిస్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్, ఐటీ ఉద్యోగులతో జగన్ సమావేశం అవుతారు. తర్వాత హెలిప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లను జగన్ ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!

అనంతరం 12:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా పరవాడ చేరుకుంటారు జగన్. పరవాడ ఫార్మా సిటీ లోని యుజియా స్టెర్లి ప్రేవేటు లిమిటెడ్ పరిశ్రమలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 01:30 గంటలకు అచ్యుతాపురం సెజ్ కు చేరుకుంటారు. అచ్యుతాపురంలో 01:30 గంటల నుంచి 01:45 గంటల వరకు ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం అవుతారు. అక్కడ నుంచి లారెస్ లాబ్ కు చేరుకొని యూనిట్ 2 ను ప్రారంభిస్తారు.



అనంతరం పరిశ్రమను సందర్శించి సీఈఓ, డైరెక్టర్లు, ఉద్యోగులతో జగన్ ఇంటరాక్ట్ అవుతారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3:10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు జగన్. 3:20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

#ap-cm-jagan #infosys #vizag
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe