Ap CM: ఏపీ ముఖ్యమంత్రి(AP Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Ys jagan) గురువారం (జనవరి18) హైదరాబాద్ కు రానున్నారు. వైఎస్ షర్మిల (Ys Sharmila) , బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి(Rajareddy) నిశ్చితార్థం (Engagement) గుండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ రానున్నట్లు సమాచారం.
వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు వైఎస్సాఆర్ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు చాలా మంది తరలి వస్తున్నారు. వైఎస్ షర్మిల రాజకీయాలకు అతీతంగా చాలా మంది రాజకీయ ప్రముఖులకు కుమారుడి వివాహ పత్రికను అందజేశారు.
ఎంగేజ్‌మెంట్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు..
ఆ తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఆహ్వానాలను కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులకు షర్మిల అందించారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తన అన్న సీఎం జగన్ ను కలిసి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఇందుకు జగన్ అంగీకరించినట్లు షర్మిల స్వయంగా తెలిపారు. ప్రస్తుతం నెట్టింట్లో ఎంగేజ్‌మెంట్, వివాహం అనంతరం నిర్వహించే రిసెప్షన్ ఆహ్వాన పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా హాజరవుతున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 17న జోధ్‌పూర్ లో రాజారెడ్డి- ప్రియ వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24న పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ ను వైఎస్సాఆర్ కుటుంబం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ ను నిర్ణయించారు. వైఎస్సాఆర్ మరణించిన తరువాత వారి కుటుంబంలో ఇదే మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులందరూ హాజరవుతారని సమాచారం.
అరగంట పాటు..
ఈ సందర్భంగా జగన్ సాయంత్రం 7 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి నిశ్చితర్థానికి చేరుకుంటారు. అక్కడ సుమారు అరగంట పాటు ఈ వేడుకలో ఉంటారు. ఆ తరువాత అక్కడ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకుంటారు.
Also read: చిరంజీవి హీరో కాదు..విలన్..అంటూ సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు!