YS Vijayamma: ఏపీ పాలిటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో అన్నకు ప్రత్యర్థిగా మారిపోయిన వైఎస్ షర్మిల సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షర్మిల తీరుపై అటు జగన్ సైతం సీరియస్ అవుతున్నారు. ఓ రేంజ్‌లో ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఏపీలో అన్నాచెల్లెళ్లు జగన్, షర్మిల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.
Also Read: వైసీపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే..!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం కొడుకు కూతురు మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిలో ఎవరికి మద్దతివ్వాలో తెలియక సతమతవుతున్నారు. బస్సు యాత్రలకు ఇద్దరినీ ఆశీర్వదించి పంపిన ఆమె ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎవరి వైపు నిలబడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కూతురు షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో ఎవరికి మద్దతుగా నిలబడుతారోనని ఉత్కంఠ నెలకొంది. కొందరూ తల్లి విజయమ్మ సపోర్ట్ జగన్ కు అంటుండగా మరికొందరూ షర్మిలకే అని కామెంట్స్ చేసేవారు.
Also Read: పాకిస్థాన్‌లో దారుణం.. భార్య, ఏడుగురు పిల్లలకు తిండి పెట్టలేక..!
అయితే, అందరి అంచాలకు దూరంగా విజయమ్మ ఎన్నికల వేళ విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న మనవడు, షర్మిల కొడుకు దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు విజయమ్మ అమెరికాలోనే ఉంటారని సమాచారం. అయితే, విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కొడుకు కూతురు మధ్య ఎన్నికల ఒత్తిడి తట్టుకోలేకనే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారా? అని రాజకీయా నాయకులు అంటున్నారు.