CM Jagan Meeting with 8000 YSRCP Leaders: వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ (CM Jagan) రేపు తన పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విజయవాడ (Vijayawada) లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ఎంపీపీలతో సహా ముఖ్య నేతలు (YSRCP Leaders) హాజరుకానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఏపీ నీడ్స్ జగన్ (AP Needs Jagan) క్యాంపెయిన్ ను క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్లేలా శ్రేణులను సమాయత్తం చేయడమే సమావేశ ఎజెండాగా ఉంటుందని ముఖ్య నేతలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP Politics: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి
రేపు ఇందిరా గాంధీ స్టేడియం వేదిక జరగబోతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. దాదాపు 8,000 మంది హాజరయ్యే ఈ సభ కోసం వివిధ కేటగిరీల వారీగా గ్యాలరీని ఏర్పాటు చేశారు.. సభకు వచ్చే ప్రతినిధులు కోసం ప్రత్యేక భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్, మండలి స్థాయి నాయకులు వరకు ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చ ఉంటుందని వివరించారు.
ఇది కూడా చదవండి: AP Opinion Poll 2023: ఏపీలో జగన్ కు షాకిచ్చిన సర్వే… ఎన్ని సీట్లు తగ్గుతాయంటే?
రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 75 శాతం పూర్తి చేశామన్నారు. పేదల కుటుంబాలలో వెలుగు నింపేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. డబ్బు ఉన్నవారికే మెరుగైన వైద్యం కాకుండా ప్రతి పేద వారి కుటుంబాలకు ఇంటి వద్దకే వచ్చి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం జగనన్న సురక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? లేదా? అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.