ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తుండడంతో అధికార వైసీపీ (YCP) దూకుడు పెంచింది. మరో సారి అధికారం దక్కించుకోవడం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పనితీరు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల మార్పు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మరో 48 గంటల్లో అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 1 నుంచి అభ్యర్థులను ప్రచార క్షేత్రంలోకి దించాలని జగన్ వ్యూహంగా తెలుస్తోంది. జనవరి నెలలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కార్యక్రమాలతో అభ్యర్థులు ప్రతీ ఇంటికి వెళ్లేలా వ్యూహం రచిస్తున్నారు జగన్.
ఇది కూడా చదవండి: CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు!
పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ కు జగన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు, మారో పక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మార్పులు జరిగిన, జరగబోయే స్థానాల్లో నేతల మధ్య సమన్వయ బాధ్యతలు రీజనల్ కోఆర్డినేటర్స్ కి జగన్ అప్పగించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని వారిని ఆదేశించారు. కొత్త, పాత ఇంఛార్జి లతో పాటు ముఖ్య నేతలను సమన్వయం చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పినట్లు సమాచారం.
రీజనల్ స్థాయిలో మార్పుల వివరాలను ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లకు జగన్ వివరించారు. మార్పుల ప్రకటన వచ్చేలోపు ఆయా స్థానాల్లో పరిస్థితులు చక్కబెట్టలని ఆదేశించారు. అయితే.. అభ్యర్థుల మార్పు, ముందుగానే టికెట్ల ప్రకటనతో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, ఆశావహులు పార్టీలు వీడే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన గూటికి చేరారు.