APPSC Group-1 : గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ సర్కార్ కీలక ప్రకటన

2018 గ్రూప్-1 పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది.

AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి  సంచలన విషయాలు!
New Update

ఏపీపీఎస్సీ(APPSC) 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు(AP High Court) నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు(Group-1 Jobs) సాధించి ప్రస్తుతం గ్రూప్-1 అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్న 143 మంది అభ్యర్థుల భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్(Jagan Sarkar) కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని తెలిపింది. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారి ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

అసలేం జరిగిందంటే?

2018 లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌(Group-1 Mains) ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌ పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టు(AP High Court) ను ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది. జులై 22, 2022లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ప్రకటించింది.

అయితే ఆ తర్వాత డిజిటల్‌ వాల్యుయేషన్‌పై ఏపీ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. దీంతో గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్ష ఫలితాలను నిలిపివేశారు. జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని APPSCని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఏపీ హైకోర్టు మరో 6 నెలల్లో ఎగ్జామ్‌ పెట్టాలని చెప్పింది.

#ap-jobs #group-1-mains #appsc-group-1
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe