CM Jagan: అమ్మపై అలిగిన జగన్.. ఏం చేశాడంటే!

ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మపై అలిగినట్లు తెలుస్తోంది. కూతురు షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలంటూ విజయమ్మ వీడియో రిలీజ్ చేయడంపై మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా విజయమ్మకు జగన్ శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

CM Jagan: అమ్మపై అలిగిన జగన్.. ఏం చేశాడంటే!
New Update

CM Jagan: ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మపై అలిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కూతురు షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలంటూ విజయమ్మ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన జగన్ ఈ రోజు మదర్స్ డే సందర్భంగా విజయమ్మకు విష్ చేయలేదు. గతంలో అమ్మను పొగుడుతూ పోస్టులు పెట్టిన ఆయన ఈయేడాది ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం చర్చనీయాంశమైంది.

ఈ మేరకు ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న విజయమ్మ శనివారం సంచలన వీడియోను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డిగారిని ప్రేమించే, అభిమానించే వారంతా షర్మిలను కూడా ఆదరించాలని కోరారు. షర్మిలకు మద్దతుగా నిలిచి, రాజశేఖర్ రెడ్డిలాగే ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. షర్మిలను ఆశీర్వదించి కడప ఎంపీగా పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: AP Elections: తిరుపతిలో పోలింగ్ బూత్ వివాదం.. వీడియో వైరల్!

దీంతో కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం వైఎస్ జగన్‌కు విజయమ్మ బిగ్ షాకిచ్చిందని, దీంతో జగన్ అలిగినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తల్లికి విష్ చేయకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

#ap-cm-jagan #vijayamma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe