YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM Jagan Mohan Reddy) యువ లాయర్లకు శుభవార్త అందించారు. నేడు వైఎస్సార్ లా నేస్తం స్కీం(YSR Law Nestham Scheme) కింది లబ్దిదారుల అకౌంట్లోకి రూ. 30వేల రూపాయలను జమ చేయనున్నారు. వైఎస్సార్ లా నేస్తం స్కీం రెండో విడత నిధులను నేడు ఆయన విడుదల చేయనున్నారు. ఈనిధులు యువ లాయర్ల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఏపీలోని 2,087మంది కొత్త లాయర్ల ఖాతాల్లో జమ కానున్నాయి.
ఏపీ సర్కార్ కొత్తగా లా గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి వృత్తిలో కొంత నైపుణ్యం సాధించేంతవరకు సహాయం అందించేందుకు మూడేళ్లపాటు ఈ స్టైఫండ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏడాదికి రూ. 60వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా 6 నెలలకు రూ. 30వేల చొప్పున రిలీజ్ చేస్తోంది. అలా న్యాయవాదులకు నెలకు రూ. 5వేల చొప్పున మనీ స్టైఫండ్ అందుతోంది. ఇలా ఆరునెలలకు సంబంధించిన స్టైఫెండ్ నేడు రెండో విడతగా రిలీజ్ చేస్తోంది. దీనికి సర్కార్ రూ. 7,98,95,000కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
కాగా ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందడమే లక్ష్యంగా కొత్త కొత్త పథకాలను తీసుకువస్తున్నారు. వైఎస్సార్ లా నేస్తం కూడా అలాంటి పథకమే. కొత్త లాయర్లకు అండగా నిలవడం కోసం తీసుకువచ్చి ఈ పథకాన్ని సీఎం 3ఏళ్ల క్రితం నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. నేడు డబ్బు తీసుకునే లాయర్లకు ఈ డబ్బు కొంత వరకు ఆర్థిక సాయంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు సరైన కేసుల్లో వాదించేందుకు వీలుగా ఉంటుంది. డబ్బుకోసం అక్రమ కేసుల్ని వాదించకుండా అడ్డదారులు తొక్కకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ స్కీం ను తీసుకువచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో అత్యధిక మంది ఇష్టపడిన కారు ఇదే..ఇది ప్రత్యేకత ఏంటో తెలుసా..?