Demonetization: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు! రూ.500, 200 నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అవినీతిని అడ్డుకోవడానికి ఇదే ఉత్తమమార్గం అన్నారు. దీంతో మోడీ మరోసారి నోట్లు రద్దు చేయబోతున్నారా? చంద్రబాబుతో ముందే చెప్పించారా? అనే కోణంలో చర్చమొదలైంది. By srinivas 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నోట్ల రద్దుపై సంచలన కామెంట్స్ చేశారు. కొంతమంది గత ఐదేళ్లలో దోచేసిన సొమ్ముతో వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని, అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు సహకరించాలి.. ఈ మేరకు బుధవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5,40,000 కోట్లతో రుణాలను అధికారులు రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాల నిధుల మంజూరు, రైతు రుణాల మాఫీ, పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. ఇదిలా ఉంటే.. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోసారి మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతుందా? అందులో భాగంగానే చంద్రబాబు ఈ ప్రస్తావన తీసుకువచ్చారా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. ఇక 2016 నవంబర్ 8న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.1000, 500 నోట్లను రద్దు చేసి వీటి స్థానంలో రూ.2000, 500, 200 నోట్లను తీసుకొచ్చింది. #ap-cm-chandrababu #demonetisation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి