AP News: సామాన్య కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ఆప్యాయత.. పిలుపించుకుని పలకరింపులు!

ప్రతిపక్షంలో పర్యటనలకు వెళ్లినప్పుడు తనపై అభిమానం చూపించిన కార్యకర్తలను గుర్తుపెట్టుకుని అప్యాయత చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గురువారం సచివాలయంలో దెందులూరు దుర్గాదేవి, వినుకొండ శివరాజును అప్యాయంగా పలకరించి, మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు.

New Update
AP News: సామాన్య కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ఆప్యాయత.. పిలుపించుకుని పలకరింపులు!

Amaravati : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్య కార్యకర్తలపై అప్యాయత చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన కార్యకర్తలను గుర్తించి తన దగ్గరకు పిలుపించుకుని మాట్లాడుతున్నారు. ఈ మేరకు సీఎం బాధ్యతలు చేపట్టాక క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్న ఆయన.. గురువారం సచివాలయంలో ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ ను అప్యాయంగా పలకరించి, మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. వారితో ఫొటోలు కూడా దిగారు.

ఈ మేరకు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా వారిద్దరూ అక్కడికి వచ్చేవారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి చంద్రబాబును కాన్వాయ్ తో పాటు స్కూటీపై వచ్చి ఉత్సాహంగా పాల్గొనేది. వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ చంద్రబాబు పర్యటనలను ముందుగానే తెలుసుకుని అక్కడికి చేరుకునేవాడు. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో కూడా ఆ ఇద్దరు కార్యకర్తలు కొన్ని రోజులు రాజమండ్రిలోనే ఉండి బాబు ఎప్పుడు బయటకు వస్తారా అని ఆతృతగా ఎదురు చూశారు. తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన ఆ ఇద్దరిని గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా గురువారం పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ నేపథ్యాన్ని వాకబు చేశారు. సాక్షాత్తూ తమ అభిమాన నాయకుడే నేరుగా తమతో మాట్లాడటంతో దుర్గాదేవి, శివరాజు యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ఎంతో విలువ ఇస్తారన్నదానికి ఇదొక మచ్చుతునక అంటూ మురిసిపోతున్నారు.

Also Read : మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ

Advertisment
తాజా కథనాలు