TDP-AP CID: టీడీపీకి షాక్ ఇచ్చిన సీఐడీ.. ఆ వివరాలు ఇవ్వాలని నోటీసులు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. టీడీపీ పార్టీ ఖాతాల్లోకి వచ్చిన రూ.27 కోట్ల విరాళాల లెక్కలు చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సిబ్బందికి సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందించారు.

New Update

తెలుగుదేశం పార్టీకి ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. పార్టీ ఖాతాల వివరాలను అందించాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందించారు. ఈ నెల 18లోగా ఈ నోటీసుకు వివరణ అందించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. స్కిల్ డవలప్మెంట్ కేసుకు సంబంధించి పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ.27 కోట్ల విరాళాల వివరాలను చెప్పాలని స్పష్టం చేసింది సీఐడీ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నారు. అయితే.. టీడీపీ ఆఫీసుకు ఏపీ సీఐడీ నోటీసులు అందించడంతో సీఐడీ ఈ కేసులో మరింత దూకుడును ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు తమను వేధిస్తున్నారని.. హైకోర్టును ఇప్పటికే టీడీపీ ఆశ్రయించింది.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

#ap-skill-development-case #tdp #ap-ex-cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe