AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి

రాజధానిని విశాఖకు తరలిస్తామన్న ఏపీ సీఎం జగన్ వాఖ్యలపై ఏపీ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజధానికి అమరావతి నుంచి విశాఖను తరలించడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే రాయలసీమకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

New Update
AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి

విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్‌ (CM Jagan) చెప్పిన విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయించడం చారిత్రిక తప్పిదం అని అన్నారు. దీనికి పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు.

ఉత్తరాంద్ర ప్రజల కోరికలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని అన్నారు. కానీ, రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ వాలకం పంటినొప్పికి తుంటిమీద తన్నినట్లుందని ఎద్దేవా చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తులసిరెడ్డి. ఏ కోణం లో చూచినా ఈ నిర్ణయం వైసీపీ సర్కార్ కు సెల్ఫ్ గోల్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: AP CM Jagan: త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్

ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా తెప్పించాలని తులసిరెడ్డి సూచించారు. బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ తెప్పించాaని కోరారు. ప్రస్తుత రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని.. 2022 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని తులసిరెడ్డి గుర్తు  చేశారు. కాబట్టి రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత

Advertisment
తాజా కథనాలు