AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. అదే ప్రధాన ఎజెండాగా తీర్మానం!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నట్లు సమాచారం.

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. అదే ప్రధాన ఎజెండాగా తీర్మానం!
New Update

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. నివేదికలో నిపుణులు పేర్కొన్న అంశాలను ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపై క్యాబినెట్ సమాలోచనలు జరిపింది. రేపు విడుదల చేయనున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రం అంశాలు కూడా నేటి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై ప్రతిపాదనలు..
అలాగే కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి నీతి ఆయోగ్‌లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన రిపోర్టుపై చర్చించగా.. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌పై రెండు సూచనలు చేసింది నిపుణుల కమిటీ. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ వేస్తే సరిపోతుందని తొలుత నివేదిక ఇచ్చింది. సమాంతరంగా మరో డయాఫ్రమ్‌ వాల్ నిర్మించడం ఉత్తమమని మరో నివేదిక ఇచ్చింది. నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నన్నారు సీఎం చంద్రబాబు. నీతి ఆయోగ్‌లో ప్రతిపాదన పెట్టాలంటే ఏపీ కేబినెట్ ఆమోదం తప్పనిసరి. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడంపై అభినందిస్తూ తీర్మానం చేశారు. ఇక ఈ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వైసీపీ విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. కౌంటర్ ఇవ్వడంలో ఎక్కడ వెనుకడుగు వేయొద్దని దిశానిర్దేశం చేశౄరు. కేంద్ర నిధుల విషయంలో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

#cm-chandrababu #ap-cabinet #meeting-concluded
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe