AP Cabinet Meeting Postponed: ఏపీ కేబినెట్ వాయిదా పడింది. ఆగస్టు 2న జరగాల్సిన కేబినెట్ భేటీ వచ్చే నెల 7న జరగనున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు1న సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈసారి జరిగే భేటీలో రాష్ట్ర కేబినెట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పలు కీలక పథకాలు.. ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్ల పంపిణీ వంటి పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఇళ్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు..
సోమవారం హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తాం అని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తాం అని హామీ ఇచ్చారు.
Also Read: వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి కారణం మానవ తప్పిదమేనా?