/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/YS-Sharmila-jpg.webp)
YSRCP MLA Arthur Joined in Congress: నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోలీసు అధికారిగా పదవీ విరమణ చేసిన ఆర్థర్ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నందికొట్కూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. ఎన్నికైన కొన్ని రోజుల నుంచే నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో ఆయనకు విభేదాలు ప్రారంభమయ్యాయి. రాను రాను ఆ విభేదాలు పెద్దగా మారడంతో ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆర్థర్ టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఈ రోజు ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నందికొట్కూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
YSRCP Nandikotkur MLA Thoguru Arthur Garu joined the Congress party in the presence of APCC President Smt @realyssharmila garu . pic.twitter.com/gduihaS8XO
— INC Andhra Pradesh (@INC_Andhra) March 19, 2024
Also Read: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు