AP: పొత్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. విష్ణువర్ధన్ రెడ్డికి అధిష్టానం సీరియస్ వార్నింగ్! ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించింది. వ్యవహారశైలి మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. By srinivas 19 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి BJP Leader Vishnuvardhan Reddy: ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఇంకోసారి హైకమాండ్ పర్మిషన్ లేకుండా పొత్తుల (Alliance) గురించి డిష్కస్ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. విష్ణువర్ధన్ రెడ్డి సీఎం అభ్యర్థి.. ఈ మేరకు ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena) ఇప్పటికే పోత్తులు పెట్టుకోగా బీజేపీ సైతం పొత్తుల కోసం ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల జోరుగా చర్చ నడుస్తోంది. అలాగే ఏపీ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలు సైతం పోత్తుల అంశంపై పలుచోట్ల ప్రసావిస్తూనే ఉన్నారు. అంతేకాదు బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం కూడా మొదలైంది. ఇది కూడా చదవండి : Gudivada Politics: కొడాలి నానికి భారీ షాక్.. గుడివాడ బరిలో కొత్త అభ్యర్థి! జాతీయ నేతలకు ఫిర్యాదులు.. ఈ క్రమంలోనే ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న బీజేపీ (BJP) పెద్దలు ఏపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మరికొందరు నేతలు.. విష్ణువర్ధన్, తదితరులు పలు కార్యక్రమాల్లో చేసిన ప్రకటనలపై జాతీయ నేతలకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. కాగా ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించిన అధిష్టానం.. ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని (Purandeswari) ఆరా తీసిందని, పార్టీ జాతీయ సమ్మేళనంలో విష్ణు వ్యవహార శైలిపై కూడా అగ్రనేతలు సీరియస్ అయినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అలాగే రాష్ట్ర అధ్యక్షురాలి అనుమతి లేకుండా, కనీసం పార్టీ ఇన్‌ఛార్జులకు తెలియకుండా విష్ణు ఎలా మాట్లాడుతాడని, తీరుమార్చుకోవాలంటూ చురకలంటించారట. దీంతో పెద్దల ఆగ్రహంతో సమ్మేళనం మధ్యలోనే విష్ణు వర్ధన్ రెడ్డి కదిరికి వెళ్లిపోయాడని సమాచారం. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టాపిక్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవగా బీజేపీ ఇంకా తమ పొత్తుపై ఎలాంటి స్పష్టతకు రాలేదు. #ap-elections-2024 #ap-bjp-leader-vishnuvardhan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి