Chandrayaan-3:ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ తిలకించాలి: పురంధేశ్వరి!

Chandrayaan-3:ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ తిలకించాలి: పురంధేశ్వరి!
New Update

Purandeswari On Chandrayaan-3: యావత్‌ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన చంద్రయాన్‌ 3 సేఫ్‌ ల్యాండింగ్‌ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఓ అద్భుతం జరగబోతుందని శాస్త్రవేత్తలు, ప్రజలు, రాజకీయ నాయకులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కీలక ఘట్టం పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్పందించారు. చరిత్రలో జరగబోతున్న ఓ మహత్ కార్యాన్ని చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ఆమె చంద్రయాన్ 3 గురించి మాట్లాడుతూ..చంద్రయాన్ 3 చంద్ర భూభాగాన్ని తాకేందుకు సిద్దమవుతున్న కొద్దీ ఉత్సాహాం పెరిగిపోతుందని ఆమె అన్నారు.

చంద్రయాన్‌ 3 విజయం కోసం కొన్ని కోట్ల హృదయాలు వేచి చూస్తున్నాయని ఆమె అన్నారు. ఈరోజు సాయంత్రం 6:04 నిమిషాలకు చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దానిని తిలకించేందుకు ప్రజలు అందరూ కూడా సిద్దంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇస్రో గొప్పతనాన్ని, వారి పడిన శ్రమను, వారు చేసిన కృషిని ప్రజలు గుర్తించాలని ఆమె అన్నారు. గత నెల 14 న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 మరి కొన్ని గంటల్లో చంద్రుని మీద ల్యాండ్‌ అవ్వడానికి సిద్ధమవుతుంది. దాదాపు 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది.

Also Read: 🔴 Chandrayaan 3 Live Updates: చంద్రయాన్-3 లైవ్ అప్‌డేట్స్‌

#chandrayaan-3 #purandeswari-on-chandrayaan-3 #daggubati-purandeswari #chandrayaan-3-latest-news #bjp #chandrayan-3
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe