Aarogyasri: జగన్ సర్కార్ కు షాక్.. ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!

ఈనెల 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ఆసుపత్రుల కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే మూడు సార్లు చెప్పినా పట్టించుకోలేదని.. రూ.850 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించింది.

New Update
Dr YSR Aarogyasri: ఆరోగ్యశ్రీ  సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు!

AP Aarogyasri Scheme: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్ (CM Jagan) ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. చికిత్స కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. కొత్త ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఏకంగా రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం సదుపాయం ఏర్పాటు చేశారు.

Also Read: పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన పెళ్లి కొడుకు.. ఇంతలోనే..!

అయితే, జగన్ సర్కార్‌పై ఆరోగ్య శ్రీ (YSR Aarogyasri Scheme) ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడుతోంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 850 కోట్ల మేర బకాయిలు రావాల్సిందని వెల్లడించింది.

Also Read: భర్తకు కావ్య విడాకులు… పంచాయితీ పెట్టిన అనామిక, ధాన్యలక్ష్మీ.. ఇందిరాదేవి ప్లాన్ ఫలిస్తుందా..?

ఈ నేపథ్యంలోనే, పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ డిమాండ్ చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు