Aarogyasri: జగన్ సర్కార్ కు షాక్.. ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!
ఈనెల 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ఆసుపత్రుల కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే మూడు సార్లు చెప్పినా పట్టించుకోలేదని.. రూ.850 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించింది.