kidney Damage: కిడ్నీలో ఏదైనా సమస్యను అనుభవిస్తున్నట్లయితే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే.. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే కిడ్నీ పాడైపోయినప్పుడు శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు రాలేక అనేక రకాల వ్యాధులు వస్తాయి. మూత్రపిండాలు దెబ్బతినడానికి ముందు శరీరంలో హెచ్చరిక సంకేతాలు తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని పక్కకు పడేస్తే పెద్ద ప్రమాదాలు వస్తాయని చెబుతున్నారు. కావునా కొన్ని లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. కిడ్నీ డ్యామేజ్ ఐదు వార్నింగ్ సంకేతాలు, లక్షణాలు కిడ్నీ పాడయ్యే ముందు హెచ్చరిస్తుంది. ఆ పొరపాటున కూడా నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కిడ్నీహెచ్చరిక సంకేతాలు ఇవే:
నిద్రలేమి:
- రాత్రిపూట మంచి, గాఢమైన నిద్రను పొందలేకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కిడ్నీ దెబ్బతినడానికి సంకేతం కావచ్చు.ఇలాంటి లక్షణం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సకాలంలో చికిత్స పొందితే.. మూత్రపిండాలు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు.
వికారం:
- మూత్రపిండ సమస్య ఉన్నప్పుడు.. తరచుగా వికారంగా అనిపిస్తుంది. ఆ సమయంలో పరిస్థితిని ఎప్పుడూ విస్మరించకూడదు. లేకుంటే అది భవిష్యత్తులో పెద్ద సమస్యలను కలిగిస్తుంది. ఇది జరిగినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
అలసట-బలహీనత:
- రోజంతా అలసటగా, బలహీనంగా అనిపించడం కూడా కిడ్నీ దెబ్బతినడానికి హెచ్చరిక సంకేతమని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యల దగ్గరకు వెళ్లాలి. చాలా మంది శరీరంలో బలహీనత అనిపించినప్పుడు దానిని వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా చేస్తే తీవ్రంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆకలి తగ్గటం:
- ఏదైనా కిడ్నీ సమస్య ఉంటే అకస్మాత్తుగా ఆకలి మందగించవచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు శరీరంలోని అదనపు వ్యర్థాలు బయటకు రాలేక ఆకలి తగ్గుతుంది.
మూత్రవిసర్జనలో సమస్య:
- మూత్రవిసర్జన ఎక్కువ, తక్కువ వస్తుంటే మూత్రపిండాల నష్టాన్ని సూచిస్తుందని అర్థం. దీనిని పక్కన పెట్టకాకుండా..వైద్యుడిని సంప్రదించాలి. దీనితో..అనేక సమస్యలను ముందుగానే పరిష్కరించవచ్చు, మూత్రపిండాల ఆరోగ్యం సరైన సమయంలో మెరుగుపడుతుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే టీ,కాఫీ బదులు ఇది ట్రై చేయండి.. మీ డే సూపర్‌గా ఉంటుంది
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.