Anushka Shetty Marriage With Producer : టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చాల తక్కువ టైం లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని అనుష్కకు కం బ్యాక్ ఇచ్చింది.
ఈ మూవీ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన స్వీటీ రీసెంట్ గా రెండు సినిమాలకు సైన్ చేసింది. కాగా 40 ఏళ్లకు పైగా వయసున్న అనుష్క ఇప్పటివరకు పెళ్లి జోలికి వెళ్లకుండా ఇంకా సింగిల్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే ఈమె పెళ్ళికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
Also Read : భూ వివాదం కేసు.. ఎన్టీఆర్ టీమ్ ఏం చెప్పిందంటే?!
కన్నడ నిర్మాతతో అనుష్క పెళ్లి
ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి మ్యాటర్ తెరపైకి వచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన 42 ఏళ్ళ ప్రముఖ నిర్మాతను (Kannada Producer) అనుష్క పెళ్లి చేసుకోబోతుందని, ఇదే ఏడాది వీరి పెళ్లి జరగనుందని సోషల్ మీడియా అంతటా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ ఒకింత షాక్ అవుతున్నారు. కొందరు మాత్రం ఈ న్యూస్ లో నిజం లేదంటూ కొట్టి పారేస్తున్నారు.
మరికొందరైతేఅనుష్క ప్రభాస్ ను వదిలి నిర్మాతను ఎలా పెళ్లి చేసుకుంటుంది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అనుష్క లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.