Anushka Shetty: 'శీలావతిగా'.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది. క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'శీలావతి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
Anushka Shetty: 'శీలావతిగా'.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో  రిపీట్

Anushka Shetty: సినిమాలు చేసిన.. చేయకపోయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్స్ అతి కొద్దీ మంది ఉంటారు. వారిలో ఒకరు అనుష్క శెట్టి.. ముద్దుగా స్వీటీ అని కూడా పిలుస్తారు. స్టార్ హీరోలతో సమానంగా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే బాహుబలి తరువాత కొంత కాలం గ్యాప్ ఇచ్చిన అనుష్క.. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో మరో సారి హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత.. తెలుగులో అనుష్క నెక్స్ట్ సినిమా ఏంటా.. అని ఎదుచూస్తున్న సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

అనుష్క, క్రిష్ కాంబో

అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ ఆలస్యం కావడంతో.. హరిహర వీరమల్లుకు కాస్త విరామం ప్రకటించిన క్రిష్.. అనుష్కతో కొత్త ప్రాజెక్ట్ ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వైరలవుతోంది.

Also Read: Rakul Preeth: పెళ్ళికి ముందు భర్తతో.. రకుల్ ప్రీత్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న వీడియో

publive-image

శీలావతిగా అనుష్క

క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీకి శీలావతి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ.. సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైనట్లు సమాచారం. అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత.. శీలావతి ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక సినిమా జోనర్, అనుష్క పాత్ర ఎలా ఉండబోతోందనే ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. 14 ఏళ్ళ క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన వేదం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కావడం.. మరింత ఆసక్తిని పెంచుతోంది.

Also Read: Megastar Chiranjeevi : ”నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ”.. భార్యకు మెగాస్టార్ స్పెషల్ విషెష్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు