Anushka Shetty Birthday: నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అనుష్క శెట్టి

స్టార్ నటి అనుష్క శెట్టి నేడు 42వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ, సన్నిహితులతో కలిసి ఈ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ బర్త్ డే సందర్భంగా అనుష్క ఫ్యాన్స్ కు 'భాగమతి' మూవీ మేకర్స్ సాలిడ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

New Update
Anushka Shetty Birthday: నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అనుష్క శెట్టి

Happy Birthday Anushka Shetty: స్టార్ నటి అనుష్క శెట్టి నేడు 42వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ, సన్నిహితులతో కలిసి ఈ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోనుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సహనటులు, అభిమానులు, పలువురు ప్రముఖులు నటికి తమదైన స్టైల్ లో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న స్వీటీ.. భారీ విజయాలు అందుకుని హీరోల‌కు స‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ మెప్పించిన నటి భాషతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

 Anushka Shetty birthday

Also Read:వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

ఇదిలా ఉంటే.. ఈ బర్త్ డే సందర్భంగా అనుష్క ఫ్యాన్స్ కు 'భాగమతి' (Bhaagamathie) మూవీ మేకర్స్ సాలిడ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన 50వ సినిమాగా రాబోతున్న 'భాగమతి 2'ను అధికారంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ‘బాహుబలి 2’ సినిమా తర్వాత అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో వచ్చిన ‘భాగమతి’ తెలుగు, తమిళంలో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కగా భారీ అంచనాలతో విడుదలై కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. అయితే 2018లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ ను ఐదేళ్ల తర్వాత మళ్లీ తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేయగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. పూర్తి లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీతో అనుష్క మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతుందని మురిసిపోతున్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చిన 'భాగమతి' చిత్రానికి జి.అశోక్ దర్శకత్వం వహించగా మళ్లీ ఇదే బ్యానర్ లో రాబోతున్న ‘భాగమతి 2’కు డైరెక్టర్ మారబోతున్నట్లు ఇండస్ట్రీలో కొంతకాలంగా టాక్ నడుస్తోంది. దీనిపై ఈ అధికారిక ప్రకటనతో క్లారిటీ రానుంది.

ఇక ‘వేదం’ (Vedam) సినిమాలో సరోజ క్యారెక్టర్‌కు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి ‘అరుంధతి’ (Arundhati), ‘వేదం’, ‘రుద్రమదేవి’ సినిమాల్లోని నటనకు గానూ ఫిలిమ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది. అయితే 'బాహుబలి' తర్వాత సినిమాల వేగం తగ్గించిన ఆమె ఇటీవల వచ్చిన నవీన్ పొలిశెట్టి మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తో మళ్లీ సక్సెస్ ను అందుకుని కెరీర్ లో దూసుకుపోతుంది.

 Anushka Shetty birthday

ఈ క్రమంలోనే మలయాళంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుండగా.. 'హోమ్' మూవీ ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో జె సూర్యకు జంటగా అనుష్క నటించనున్నట్లు సమాచారం. అలాగే మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తి కాగా ఇందులోనూ అనుష్క శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని సీనీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisment
తాజా కథనాలు