/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T130952.637-jpg.webp)
ప్రస్తుతం బాలీవుడ్ లో తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక దానికి తోడుగా జూనియర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో బాలీవుడ్ లో తనదైన రీతిలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా నటించి మెప్పిస్తున్నాడు.
ఇక ప్రతి క్యారెక్టర్ లో కూడా తను లీనమై నటించే నటన ప్రతి ఒక్క అభిమానికి కూడా ఎన్టీయార్ పట్ల విపరీతమైన ఇష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా గౌరవమైతే ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన దేవర సినిమా షూటింగ్ కి కొత్త వరకు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ నటుడిగా పేరుపొందిన అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ ని కలిశాడు. ఇక తను ట్విట్టర్ లో నా అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ ను కలిశానని, ఆయనను మించిన నటుడు ఇండియాలో మరొకరు లేరని ఫ్యూచర్ లో తను చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని భావిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
అలాగే వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ఇక మొత్తానికైతే ఒక దిగ్గజ నటుడు అయిన అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడడం చూసిన ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుపమ్ ఖేర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితమనే చెప్పాలి. ఇక నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన కార్తీకేయ 2 సినిమాలో శ్రీకృష్ణుని గొప్పతనం గురించి చెప్పే ఒక సీన్ లో తను కనిపించి నిజంగా ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేశారనే చెప్పాలి.
ఇక ఆయన చెప్పే డైలాగులు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా గూజ్ బమ్స్ వచ్చాయనే చెప్పాలి. ఇక బాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడం అనేది నిజంగా తెలుగు వాళ్ళందరూ గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి…
It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y
— Anupam Kher (@AnupamPKher) May 1, 2024